అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ
నేపథ్యంలో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
దీంతో శుక్రవారం జైళ్ల శాఖ వివరణ ఇచ్చింది. ‘‘రాహుల్ భార్య కొంతకాలంగా
అనారోగ్యంతో ఉన్నారు. ఆమె గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో ఉన్న
భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారు. 4 రోజుల సెలవు అభ్యర్థనను
జైళ్ల శాఖ అంగీకరించింది. జైలు సూపరింటెండెంట్‌గా రాహుల్ ఎలాంటి నిబంధనలు
ఉల్లంఘించలేదు’’ అని జైళ్ల ఉపశాఖాధికారి వివరణ ఇచ్చారు. రాజమహేంద్రవరం కేంద్ర
కారాగారం కుట్రలకు కేంద్రంగా మారుతోందా అనే అనుమానం టీడీపీ వర్గాలను
పట్టిపీడిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు అక్కడ రిమాండులో
ఉన్నప్పుడల్లా జైలు సూపరింటెండెంట్ బదిలీ కావటం లేదా సెలవుపై వెళ్లిపోవటం,
వారి స్థానంలో వేరే అధికారులకు బాధ్యతలు అప్పగిస్తుండటం వంటివి కుట్రకు
సంకేతాలేనని టీడీపీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ గురువారం మధ్యాహ్నం
అకస్మాత్తుగా సెలవుపై వెళ్లిపోవటం చర్చనీయాంశంగా మారింది. నాలుగు రోజుల పాటు
ఆయన సెలవుపై వెళ్లటం, ఆ స్థానంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ బాధ్యతలు చేపట్టటం
వంటి అనూహ్య పరిణామాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా
పవన్‌కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ చంద్రబాబుతో ములాఖత్ అయి బయటకు వచ్చిన గంట
వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన భార్యకు అనారోగ్యం వల్లే సెలవుపై
వెళ్తున్నానని రాహుల్ చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని, ఆయనపై
కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి సెలవుపై పంపించేశారన్న వాదనలు
ఉన్నాయి.