ఆర్టీసి ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగుల సమస్యలపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ని కలిసిన ఏపీజేఏసీ అమరావతి
రాష్ట్ర కమిటీ
వెలగపూడి సచివాలయం : ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై శుక్రవారం వెలగపూడి
సచివాలయంలో ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ చీఫ్ సెక్రటరీ కె జవహర్ రెడ్డి ని
కలిసి వినతి పత్రాలు ఇచ్చి, సమస్యలపై చర్చించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్
రావు,కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు ఆధ్వర్యంలో సి ఎస్ ను ఉద్యోగులు
కలిశారు. ఔట్ సోర్శింగు ఉద్యోగులకు సినియారిటి ప్రాతిపదికన ప్రతి సంవత్సరం
జీతాలు పెంచాలి. అప్కాస్ కార్పొరేషన్ లో లేని ఔట్ సోర్శింగ్ ఉద్యోగులందరిని
అప్కాస్ లో చేర్చాలని, రెవిన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని,
ప్రభుత్వవద్ద పెండింగు ఉన్న ఆర్టీసి ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని
కోరనారు. మాజీ గ్రామాధికార్ల పెన్షన్ పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో
పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జీతలు పెంచాలని,
ఉద్యోగులలో సీనియారిటీ ప్రతిపదికన ప్రతిసంవత్సరం జీతాలు ఇంక్రీమెంట్
ప్రాతిపదికన పెంచాలని, అప్కాస్ లో లేని ఔట్ సోర్శింగు ఉద్యోగులందరినీ అప్కాస్
కార్పురేషన్ లో చేర్చి వారందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగి
పేరుతో వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఉన్న రేషన్ కార్డులు, సంక్షేమపధకాలు
తొలగించే విధానాలు విడనాడాలని ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమితి ఆధ్యర్యంలో చీఫ్
సెక్రటరీ కే.జవహర్ రెడ్డి ని శుక్రవారం సచివాలయంలో కలసి విజ్ఞప్తి చేశారు.
*ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని, గతంలో 2011 లో 100% వేతనాలు
పెంచితే, 2016లో 50% పెంచారని, 2022లో కేవలం 23% పెంచారని, పీఆర్ సీ కమిటీ ,
అధికారుల కమిటీ కనీసం 30% పెంచమని సిఫారసు చేసినప్పటికీ, కేవలం 23% పెంచారని,
కనుక వారి కుటుంబ కనీస అవసరాలు తీరాలంటే, వారి జీతాలు పెంచి వారిని, వారి
కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే అతి తక్కువ వేతనానికి
పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం
లేదని, చివరికి వారి తల్లి, తండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే సంక్షేమ
పథకాలను కూడా నిలుపుదల చేయడం చాలా బాధాకరమని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు
రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వర్తింపజేయాలని
బొప్పరాజు కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీనియార్టీ ప్రాతిపదికన అదనపు
ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చి వారిని ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలోని
సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో గత మూడు సంవత్సరాలుగా (2019 నుండి)
పనిచేస్తూ, గురుకుల పాఠశాలలో విద్యార్థులు తగ్గి పోయారనే కారణం చేత
తొలగించబడ్డ దాదాపు 1000 మందికి పైగా స్వీపర్లు, శానిటరీ వర్కర్లు, సెక్యూరిటీ
గార్డులను విధుల్లోనికి తీసుకుని వారందరినీ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్
ఔట్సోర్సింగ్ సర్వీస్ నందు విలీనం చేసి వారికి న్యాయం చేయాలని
బొప్పరాజు,పలిశెట్టి దామోదరరావు,వి.వి.మురళికృష్టం నాయుడు కోరారు.
రెవెన్యూ ఉద్యోగులకు పనిభారం తగ్గించాలి : రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో వారి
శాఖాపరమైన రోజువారీ చేసే పనులు కాకుండా, ఇతర శాఖల పనులు, టార్గెట్లు పెట్టి
తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న రీ సర్వే, ఓటరు నమోదు, సవరణలు ప్రక్రియలో
పూర్తిగా నిమగ్నమై ఉన్ననారని, ఈ సమయంలో రీ సర్వే, హౌసింగ్, ఇరిగేషన్, ధాన్య
సేకరణ తదితర పనులతో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరిలో ఉద్యోగులు
తీవ్ర పని ఒత్తిడికి గురి అవుచున్నారని, తక్షణమే పని భారం తగ్గిస్తూ తగు
చర్యలు తీసుకోవాలని అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రీ సర్వేలో
టార్గెట్లు పెట్టే విధానం నిలిపి వేయాలని, సక్రమంగా ఎన్నికల విధులు ప్రధానంగా
ఓటరు నమోదు సవరణలు ప్రక్రియ నిర్వహించేలా చూడాలని గౌ|| చీఫ్ సెక్రటరీ గారిని
ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తో పాటు ఏపీ రెవెన్యూ అసోసియేషన్
రాష్ట్రఅద్యక్షులు బొప్పరాజు, ప్రధానకార్యదర్శి చేబ్రోలు కృష్టమూర్త
విజ్ఞప్తి చేసారు.
సి ఎస్ కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీపిటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్
ఏపిపిటీడి(ఆర్టీసీ )ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వం గుర్తింపుని ఇచ్చిన
సందర్భాన్ని పురస్కరించుకుని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని
సత్కరించారు.ఈసందర్బంగా ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగులు సంబందించి సమస్యలలో
గ్రాడ్యూటీ సమస్య,పెండింగుఉన్న అఫీల్సు పై గైడ్ లెన్సు ఇవ్వాలని, పాతసర్వీస్
రూల్సు సంబందించిన జిఓ ఇవ్వాలని,పాతపద్దతిలోఅరిఫరల్ ఆసుపత్రుల ద్వారా మెడికిల్
సౌకర్యలు అందేలా చూడాలని, ఓటిలు, నైట్ ఔట్ అలవెన్సులు , విలీనంకు ముందున్న
అన్ని ఇన్సెంటివ్ పధకాలను పునరుద్దరించి జీతంతో పాటు చెల్లించే చూడాలని
విజ్ఞప్తి చేస్తూ లేఖఇచ్చారు. ఆర్టీసి ఇ.యు రాష్ట్రనాయకులు యం.డిఏ.సిద్దిక్,
యం.శంకరరావు, నారాయణ, వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఏపిజేఏసి రాష్ట్రమహిళా విభాగాన్ని పరిచయం చేసిన బొప్పరాజు : ఈ నెల 7 న
నూతనంగా ఎన్నికైన ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగాన్ని చీఫ్ సెక్రటరీ
కే. జవహర్ రెడ్డి కి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిసెట్టి దామోదర్ రావు పరిచయం చేశారు. ఏపీ
జెఎసి అమరావతి రాష్ట్ర మహిళా విభాగం చైర్ పర్సన్ గా ఎన్నికయిన పారె
లక్ష్మి,ప్రధానకార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి, అసోషియేట్ చైర్ పర్సన్
శివకుమార్ రెడ్డి, కోశాధికారి గంటా పావని తో పాటు ఇతర కమిటి సభ్యులు 15 మందిని
పరిచయం చేశారు.