కొవ్వూరు : ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేసేలా కొవ్వూరు
నియోజకవర్గం స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు హోంమంత్రి
తానేటి వనిత దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో శుక్రవారం
హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు,
ఎంపీటీలు, జడ్పీటీసీలు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, నాయకులతో తానేటి వనిత
సమీక్ష నిర్వహించారు.. నిడదవోలులో ముఖ్యమంత్రి చేతుత మీదుగా ‘వైఎస్సార్ కాపు
నేస్తం’ కార్యక్రమంలో లబ్ధిదారులకు నిధులను విడుదల చేస్తారని తెలిపారు. .
ప్రజా ప్రతినిధులు, నాయకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు
సాగాలన్నారు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని
వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ఈ దేశంలో ఏ
ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా పేదల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆలోచిస్తారని చెప్పడానికి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలే నిదర్శనమన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ జైలు అంతా చట్ట ప్రకారం న్యాయం ప్రకారమే
జరిగిందన్నారు. ప్రస్తుతం రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రతిపక్షాలు
అన్నీ ఏకమై కుయుక్తులు పన్నుతున్నాయని, వాటిని నాయకులు అంతా కలిసికట్టుగా
తిప్పికొట్టాలని హోంమంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు.