విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వ్యవహారంపై వైసీపీ
ప్రభుత్వం, సీఐడీ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార
ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు . శుక్రవారం ఆయన మీడియాతో
మాట్లాడుతూ సిమెన్స్ గ్లోబల్ సంస్థకు తెలియకుండానే సిమెన్స్ ఇండియా సంస్థతో
ఒప్పందం అనేది అవాస్తవం. సిమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్,
డిజైన్ టెక్ సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంలో
సిమెన్స్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్.. సంతోష్ సావంత్ సంతకం
పెట్టారు.సంతోష్ సావంత్ సంతకం పెట్టిన విషయాన్ని సీఐడీ, వైసీపీ ప్రభుత్వం
ఎందుకు దాస్తున్నాయి? అని ప్రశ్నించారు. నేడు తాను బయట పెట్టిన అంశాలపై చర్చకు
వచ్చే దమ్ము, ధైర్యం సజ్జల, సీఐడీ చీఫ్ సంజయ్కు ఉందా అని కొమ్మారెడ్డి
పట్టాభిరామ్ సవాల్ విసిరారు.