ర్యాలీలు, వైద్యశిబిరాలు, దళిత బస్తీల్లో పర్యటనలు * బిజెపి రాష్ట్ర
అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా భారీ స్ధాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహణ తో
పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రకాల సేవాకార్యక్రమాల్లో బిజెపి
నేతలంతా భాగస్వాములవు తారు. అదేవిధంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని
విశ్వకర్మ యోజన పధకం ప్రారంభం సందర్భంగా వివిధ వృత్తి కళాకారుల తో సమావేశాలు
నిర్వహించడతో పాటు అక్టోబర్ 2 వ తేదీ వరకు ప్రతి రోజు క్షేత్రస్ధాయిలో
కార్యక్రమాలు నిర్వహించే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగిందని
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వివరించారు. ఈ మేరకు
బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. ప్రధాన మంత్రి
నరేంద్రమోడీ వ్యక్తిత్వం, ఆయన తీసుకున్న ప్రభుత్వ విధానాలు ప్రతిబింబించే
ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 17 వ తేదీ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని
ప్రధాని ప్రారంభించ నున్న విశ్వకర్మ యోజన పధకం ప్రారంభం చేస్తారు ఈ సందర్భంగా
వివిధ వ్రుత్తుల వర్గాల వారి తో సమావేశాలు ఆర్టిజన్ సెల్, ఓబిసీ మోర్చా
ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.. బిజెవైఎం, డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో
మెగా రక్తదాన శిబిరాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించడం
జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పధకం కార్డులు నమోదు పంపిణీ కార్యక్రమం బిజెపి
శ్రేణులు స్వయంగా చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకంగా వైద్య శిబిరాలు
నిర్వహిస్తారు. 25వ తేదీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం
క్షేత్రస్ధాయిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. 26వతేదీ దళిత
బస్తీల్లో సంపర్క్ కార్యక్రమాలు అంటే దళిత బస్తీల్లో బిజెపి నేతలు రోజంతా
పర్యటనలు నిర్వహిస్తారు. 27వ తేదీ నుండి ప్రతి మండలానికి ఒక కార్యకర్త వెళ్లి
రెండు రోజులపాటు ప్రవాస్ యోజన నిర్వహిస్తారు. అక్టోబర్2 న గాంధీ జయంతి
సందర్భంగా స్వచ్చ భారత్ సెల్ ఆధ్వర్యంలో స్వచ్చత కార్యక్రమాలు నిర్వహిస్తారు.