సారవకోట : సీఎంగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిననాటి నుంచీ నేటివరకూ
రాష్ట్రం గిరిజనాభివృద్ధిలో ముందంజలో ఉందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన
కృష్ణదాస్ తెలిపారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలంలోని గిరిజన గ్రామాల
ప్రజల సమస్యలను తెలుసుకోడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో సీతంపేట ఐటిడిఏ పీఓ కల్పన కుమారితో కలిసి
గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా 67
గ్రామాలకు చెందిన గిరిజనులు వచ్చి వారి వారి గ్రామ సమస్యలను ఐటిడిఏ పీఓ కల్పన
కుమారితో విన్నవించుకున్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, త్రాగునీటి సౌకర్యం
కల్పించాలని, గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ భవనాలు, కొండ భూములకు పట్టాలకు వీలు
కల్పించాలని గిరిజన ప్రజలు కోరారు. గిరిజన గ్రామ ప్రజల సమస్యలను ఐటిడిఏ పీఓ
కల్పన కుమారి అధికారులతో కలిసి ఫైల్ చేశారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసమే
ఐటిడిఏ ఉందని, జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి గిరిజన గ్రామాల ప్రజల
సమస్యలను పరిష్కరిస్తామని ఆమె స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ గిరిజన గ్రామాలతో
ముఖాముఖి కార్యక్రమానికి బీసీ సెల్ జోనల్ ఇన్చార్జి డాక్టర్ ధర్మాన కృష్ణ
చైతన్య, జెడ్పీటీసీ వరుదు నాగేశ్వరమ్మ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.