విజయవాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ మీడియా విభాగ
ఇంఛార్జ్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో
మాట్లాడుతూ అగ్రిగోల్డ్ విషయంలో మాట తప్పాడు, మడమ తిప్పాడని వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు విషయంలో అవినీతిని కోర్టులు తేలుస్తాయన్నారు. చంద్రబాబును అరెస్టు
చేసిన విధానం మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు
చర్యే అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అణువణువునా పగ పగ అని రగిలిపోతున్నారని
విమర్శించారు. జగన్ సహజ ప్రవృత్తికి అధికారం తోడు అయ్యిందన్నారు.
ఫ్యాక్షనిస్టులకు అధికారం ఉంటే అన్నీ చలాయిస్తారన్నారు. అధికారం లేకుంటే
వారంతా పిరికిపందలే..ఆయనది, నాదీ పులివెందులే..వాళ్లను ఎప్పటి నుంచో
చూస్తున్నానని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.