అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను
ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తీవ్రంగా
తప్పుబట్టారు. ఆయనపై మోపిన అభియోగాలు అసంబద్ధమని ఆక్షేపించారు. కక్ష సాధింపులు
కలికాల మహిమని, ఇవి మంచివి కావని సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని నడిపే కేబినెట్ నిర్ణయాలను విచారణ సంస్థలు తప్పుబట్టడం,
రంధ్రాన్వేషణ చేయటం వింతగా ఉందని ఎల్వీ సుబ్రమణ్యం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కేబినెట్ నిర్ణయాలను తప్పుపట్టి విపరీత చర్యలకు దిగటం ప్రమాదకర పరిస్థితులకు
దారి తీస్తుందని ఆరోపించారు. అలాంటి చర్యలు వ్యవస్థలకు గొడ్డలిపెట్టుగా
మారుతుందని ఆక్షేపించారు. హైదరాబాద్‌లో జాతీయ క్రీడలు నిర్వహించినప్పుడు
చంద్రబాబు పాలానా విధానాన్ని దగ్గరగా చూశానని తెలిపారు. పనులు వేగంగా జరగాలని
ఒత్తిడి చేయడం మినహా ఎలాంటి సలహాలు ఇచ్చేవారు కాదని పేర్కొన్నారు. ఏ
ముఖ్యమంత్రైనా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజల అవసరాల మేరకు మాత్రమే నిధుల
విడుదలపై సూచనలు చేస్తారని ఎల్వీ సుబ్రమణ్యం వివరించారు.