ప్రకృతి వ్యవసాయంలో ఎస్.హెచ్.జి. మహిళ పాత్ర ఆమోఘం
అమరావతి : ప్రముఖ పర్యావరణ పరిరక్షకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా
నారాయన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డిని రాష్ట్ర
సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత రెండు రోజుల నుండి అనంతపూర్ లో
ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన ఆమె అనుభవాలను సి.ఎస్.తో పంచుకున్నారు.
ఎడారి లాంటి అనంతపూర్ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అద్బుతంగా సాగవుతోందని
కితాబిచ్చారు. కనీసం 20 సెంట్ల భూమిలో పేదలు కూరగాయలు పండించి
అమ్మకొనేందుకు అమలు చేస్తున్న ఎ.టి.ఎం.మోడల్ నిరుపేద రైతులను ఎంతగానో
ఆదుకుంటున్నదని,ఒక్కొక్క రైతు నెలకు రూ.25 వేల వరకూ సంపాదించుకునే అవకాశం
ఏర్పడంతో రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం
చేసిశారు.దానిమ్మ,బొప్పాయి, మునగ తదితర పంటల సాగు అద్బుతంగా జరుగుతున్నదని ఆమె
పేర్కొన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎస్.హెచ్.జి. మహిళా గ్రూపులు ఎంతో
సమర్థవంతగా పనిచేయడం చాలా విశేషమన్నారు. ఎస్.హెచ్.జి. మహిళల సహకారంతోనే ఈ
ప్రకృతి వ్యవసాయం ఎంతో సమర్థవంతంగా సాగవడానికి అవకాశం ఏర్పడిందన్నారు.
ఈ సందర్బంగా సి.ఎస్. డా.కె.ఎస్. జవహర్
రెడ్డి మాట్లాడుతూ తాను టి.టి.డి. ఇ.ఓ.గా పనిచేస్తున్న సమయంలో ప్రకృతి
వ్యవసాయం ద్వారా పండే శెనగలను టి.టి.డి. కొనుగోలు చేసుకునేలా ఒప్పదం
కుదుర్చుకోవడం జరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు.
రైతు స్థాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్
చైర్మన్ విజయమార్, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్
సి.ఎస్.రాజశేఖర్, సి.ఇ.ఓ. రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.