విజయవాడ : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను ఖండిస్తూ మైలవరం,
రెడ్డిగూడెం మండలాల్లో రెండోవ రోజు టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
కొనసాగాయి. దీక్షల శిబిరాలను సందర్శించి మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని
ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. టీడీపీ, జనసేన పొత్తుపై మాజీ మంత్రి,
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. పవన్ కళ్యాణ్ తీసుకున్నది
చరిత్రత్మాక నిర్ణయం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడుపై తప్పుడు
కేసులు పెట్టి, బురదజల్లి రాజమండ్రి జైల్లో పెట్టి జగన్ రెడ్డి కుట్రలు,
కుతంత్రాలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. సైకో జగన్‌ను, సైకో ప్రభుత్వంను
జనసేన, టీడీపీ పార్టీలు సమిష్టిగా పనిచేసి బంగాళాఖతంలో కలపాలి. టీడీపీ నిరాహార
దీక్ష శిబిరానికి వచ్చి టీడీపీ నాయకులకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు.
జనసేన నాయకులతో కలిసి దేవినేని ఉమా నినాదాలు చేశారు.