రాజమహేంద్రవరం : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గురువారం
విజయవాడ డివిజన్ లోని రాజమండ్రి రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో
ఆయనతో పాటు విజయవాడ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అరుణ్ కుమార్ జైన్ రాజమహేంద్రవరం స్టేషన్‌లోని
క్రూ కంట్రోల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి తదుపరి సిబ్బంది బుకింగ్ లాబీ
పనితీరును సమీక్షించారు. లోకో పైలట్లు గార్డుల విధుల నిర్వాహణ కు సంబందించిన
క్రూ మేనేజ్మెంట్ పనితీరును ఆయన పరిశీలించారు. జనరల్ మేనేజర్ గారు రన్నింగ్
స్టాఫ్‌ని డ్యూటీకి తీసుకునే ముందు తగిన విశ్రాంతిని అందించడంపై దృష్టి
సారించాలని మరియు సిబ్బందికి తగిన విశ్రాంతి ఉండేలా సిబ్బంది డ్యూటి నిర్వహణ
పద్దతిని సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. లోకో పైలట్లు, అసిస్టెంట్
లోకో పైలట్లతో సంభాషించి వారి పనివిధానం గురించి వారు విధులలో ఎదుర్కొనే
సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తరువాత రన్నింగ్ రూమ్‌ను కూడా
క్షుణ్ణంగా తనిఖీ చేశారు, లోకో సిబ్బందికి అందుతున్న సౌకర్యాలపై సవివరంగా
సమీక్షించారు తదుపరి లోకో పైలట్లతో సంభాషించారు. అరుణ్ కుమార్ జైన్
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ తనిఖీ కి ముందు దువ్వాడ, రాజమండ్రి సెక్షన్ల
మధ్య రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్‌లు , సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క
భద్రతా అంశాలను పరిశీలించారు. జనరల్ మేనేజర్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ను
పరిశీలించి, స్టేషన్లో ప్రయాణికులకు అందుబాటులోఉన్న మల్టీపర్పస్ స్టాల్స్,
ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి స్టాల్స్, ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్
మెషీన్లు(ఏ.టి.వీ.ఎమ్) మొదలైన సౌకర్యాలు, వసతుల గురించి సమీక్షించారు.
స్టేషన్లో సౌకర్యాలను మెరుగు పరచడానికి రూపొందించిన పునరాభివృద్ధి ప్రణాళిక
గురించి సమీక్షించారు. ప్రయాణీకులకు త్వరితగతిన ఆధునిక సౌకర్యాలు కల్పించేలా
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయడంపై ఆయన అధికారులతో చర్చించారు. జనరల్
మేనేజర్ స్టేషన్ పరిసర ప్రాంగణాన్ని పరిశీలించార స్టేషన్ ఆవరణలో త్వరలో
ప్రారంభం కానున్న రైల్ కోచ్ రెస్టారెంట్‌ను కూడా సందర్శించారు. రాజమండ్రి
స్టేషన్ తనిఖీ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
తో మార్గాని భరత్, ఎంపీ, రాజమండ్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ, రాజ్య
సభ ఇతర ప్రజాప్రతినిధులు సమావేశమై అభ్యర్ధన పత్రాలను అందజేశారు. అనంతరం జనరల్
మేనేజర్ రాజమండ్రి నుంచి విజయవాడ వరకు రియర్ విండో తనిఖీ ద్వారా ట్రాక్‌లు,
సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రత అంశాలను పరిశీలించారు.