కొవ్వూరు : ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు వీలుగా జగనన్న ప్రభుత్వంలో గడప
గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష జగనన్నకు చెబుదాం వంటి ఎన్నో కార్యక్రమాలు
అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి
డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా
133వ రోజు కొవ్వూరు పట్టణం 22వ వార్డులో హోంమంత్రి విస్తృతంగా పర్యటించారు.
బుధవారం పర్యటనతో కొవ్వూరు టౌన్ లో ఈ కార్యక్రమం పూర్తి అవడంతో ఆమె సంతోషాన్ని
వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రభుత్వ
సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలనే తపనతో రూపొందించబడినదే “గడప గడపకు
మన ప్రభుత్వం “కార్యక్రమమని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్
రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, వార్డు లోని
అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి
సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన బుక్
లెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ది చేకూరిందని
ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను హోంమంత్రి
దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు ఆదేశించారు. ఈ
కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు.