కొవ్వూరు, : ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేతగా పాలన
అందించడం కాకుండా మనసున్న నేతగా, మానవతావాధిగా పాలన కొనసాగిస్తున్నారని
రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలో చాగల్లు మండలం నెలటూరు సీతారామ కళ్యాణ
మండపంలో, కొవ్వూరు టౌన్ లో మున్సిపల్ కార్యాలయంలో ఫేజ్ 2 క్రింద కొత్తగా
పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి చాగల్లు మండలంలో
359 మందికి, కొవ్వూరు టౌన్ లో 127 మందికి మొత్తం 476 మందికి హోంమంత్రి స్వయంగా
అందజేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, పార్టీ
చూడకుండా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను
అందిస్తోందన్నారు. . గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం
రూ.2750కి పెంచి ఇస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే ఆయన బిడ్డగా వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేస్తున్నారని తెలిపారు. .
గత ప్రభుత్వంలో 2014 – 19 కాలంలో సగటున నెలకు ఖర్చు చేసింది కేవలం రూ. 400
కోట్లు మాత్రమేనని, జగనన్న ప్రభుత్వంలో జూన్ 2019 దాదాపు మూడున్నర రెట్లు
పెంపు రూ. 1,350 కోట్లు, జనవరి 2022 దాదాపు నాలుగు రెట్లు పెంపు రూ. 1,570
కోట్లు, జనవరి 2023 దాదాపు నాలుగున్నర రెట్లు పెంపు రూ. 1,800 కోట్లును
అందిస్తున్నామని తానేటి వనిత వివరించారు.గత పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు మధ్య
తేడాలను ప్రజలు గమనించి జగనన్న ప్రభుత్వానికి మరొక్కసారి మీ చల్లని దీవెనలతో
ఆశీర్వాదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.