ఎం.డి.జాని పాషా
విజయవాడ : గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీల అధికారాలు
కల్పించాలని బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాల నాయుడు ని
కలిసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఎం.డి.జాని పాషా కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలోని రాష్ట్ర కమిటీ
ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి
బూడి ముత్యాల నాయుడు ను కలిసి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ రాజ్
శాఖ 30వ తేదీ సెప్టెంబర్ మాసం 2019వ సంవత్సరంలో విడుదల చేసిన జి.ఒ నెంబర్ 149
ప్రకారం గ్రామ పంచాయతీల పరిపాలన బాధ్యతలు మరియు డిడిఒ అధికారాలు కల్పించాలని,
అలాగే గత సంవత్సరం 2022లో సెప్టెంబర్ 30వ తేదీన గ్రేడ్-5 పంచాయతీ
కార్యదర్శులకు అధికారాలు కల్పించడం కోసం ప్రారంభించిన దస్త్రం ప్రస్తుతం
మంత్రిఆమోదం కోసం పంపించబడిన సందర్భంలో, ఏడు వేల మంది గ్రేడ్-5 పంచాయతీ
కార్యదర్శులకు పూర్తి స్థాయి గ్రామ పంచాయతీల పాలనా బాధ్యతలు అప్పగించడం ద్వారా
సంపూర్ణ గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని వివరించారు. క్షేత్ర స్థాయిలో మరింత
బలమైన పరిపాలన సాధ్యమవుతుందని మంత్రికి వివరించి దస్త్రాన్ని ఆమోదించి
ఉద్యోగులకు మేలు చేయాలని కోరారు. సావధానంగా విన్న మంత్రి సానుకూలంగా
స్పందించి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర సమన్వయ
కర్త ఎం.శశిధర్,మహిళా కన్వీనర్ బి.శ్వేతా,యల్.అర్చన,రాష్ట్ర సహాయ కార్యదర్శి
జి.నవీన్ కుమార్,రహీం,మనోహర్,మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.