నాయకులు కరణంరెడ్డి నరసింగరావు , గొర్లి శ్రీనివాస నాయుడు
విజయవాడ : పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు చొరవతో రాష్ట్రం అంతటా
ఓబీసీ అమలు దిశగా ప్రయత్నం ఈ రోజు తూర్పుకాపులకు ఢిల్లీ లో మహరాష్ట్ర భవన్ లో
జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ హియరింగ్ తూర్పు కాపు నాయకులు గొర్లె
శ్రీనివాస నాయుడు, కే.ఎన్.అర్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఎన్.సి.బి.సి
చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ ఎంపి జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో ఓబీసీ
హియరింగ్ తూర్పుకాపు సంఘం నాయకులు కరణంరెడ్డి నరసింగరావు , గొర్లి
శ్రీనివాసనాయుడు తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా వున్న తూర్పు కాపు సంఘం నాయకులు
తరలివెల్లి తమ గోడును కమీషన్ ముందు వెలిబుచ్చారు. ఈ సందర్బంగా ఎంపి జీవీఎల్
మాట్లాడుతూ 2008 లో రాష్ట్రం అంతటా తూర్పు కాపుల కు బిసి రిజర్వేషన్లు ఇచ్చి
రాష్ట్రం అంతటా ఓబీసీ రిర్వేషన్ల అమలుకు ప్రయత్నం చేయలేదని తూర్పు కాపులను
గత కొన్ని సంవత్సరాలుగా మోసం చేసారని అన్నారు. తూర్పు కాపు సంఘం తరపున
కరణంరెడ్డి నరసింగరావు, గొర్లి శ్రీని వాసనాయుడు తదితరులు తన దృష్టికి
సంవత్సరం క్రితం ఈ విషయం లిఖిత పూర్వకంగా తెలియజేయడంతో కేంద్ర మంత్రి సంబంధిత
నేషనల్ బిసి కమీషన్ చైర్మన్ దృష్టికి తీసుకు వెళ్లిన తదనంతరం సెప్టెంబరు 13న
ఢిల్లీ మహారాష్ట్ర భవన్ లో జరిగే హియరింగ్ లో పాల్గొనాలని రాష్ట్ర
ప్రభుత్వంకి, ఎంపి జీవీఎల్ కి హియరింగ్ రావాలని కోరారని అన్నారు. ఢిల్లీలో
రాష్ట్రం తరపున బిసి కమీషన్ అధికారులు అనుకూలంగా పత్రాలు సమర్పించారని
అన్నారు. తదుపరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదం పొందిన వెంటనే రాష్టృ
వ్యాప్తంగా ఉన్న యాభై లక్షల మంది తూర్పు కాపులకు ఓబీసీ వర్తిస్తుందని
అన్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస నాయుడు, కే ఎన్ అర్ ఎంపి జీవీఎల్ కి
ధన్యవాదాలు తెలిపారు. ఎంపి జీవీఎల్ చొరవతో తూర్పు కాపుల చిరకాల వాంచ త్వరలో
నెరవేరనుందని అన్నారు. వీరితో పాటు శిష్టతరణాలు, కళింగ కోమటి, శొండి, అరవ
కులాల సంఘం నాయకులు కూడా తమతమ వినతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో
పార్లమెంట్ సభ్యులు ఓబీసీ నేషనల్ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ , ఎంపి బెల్లాన
చంద్రశేఖర్ , కింజరాపు రామ్మోహన్ నాయుడు, తూర్పు కాపు చైర్మన్ మామిడి
శ్రీకాంత్ , వర్కింగ్ ప్రెసిడెంట్ బలగం సేతుబందు సీతారాం , ఓబీసీ సాధన కమిటీ
కన్వీనర్ సరిపిడకల రామారావు, వెస్ట్ గోదావరి జిల్లా పిన్నింటి మహేష్, న్యాయ
సలహాదారు కునుకు రాజశేఖర్, మెరగన ప్రసాద్, కొత్తకోట ప్రసాద్, వాంజరపు దేవి
ప్రసాద్, సందక రాఘవ, పిషిని చంద్రమోహన్, పల్ల వెంకటరావు, టి శ్రీనివాసరావు
తదితరులు పాల్గొన్నారు.