గుంటూరు : స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల
19కి హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం
కోరగా హైకోర్టు అంగీకరించింది. మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్పై ఈనెల 18
వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన
విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టు దృష్టికి
తీసుకొచ్చారు. దీంతో సీఐడీ పిటిషన్పై ఎలాంటి విచారణ చేపట్టొద్దని ఉన్నత
న్యాయస్థానం ఆదేశించింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు
బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈనెల 19కి హైకోర్టు
వాయిదా వేసింది.