వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయరెడ్డి విమర్శించారు. టీడీపీ మాటలను ఎవరూ
విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీ బంద్‌కు అసలు స్పందనే లేదన్న
ఎంపీ.. బంద్ రోజు హెరిటేజ్ షాప్‌లు కూడా మూయలేదని చెప్పారు. బాబు
నీతిమంతుడని ఎవరూ అనుకోవడం లేదని, అన్ని కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకున్నారని
దుయ్యబట్టారు. రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడేనని
విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబుకు ప్రజాభిమానం లేదని, అన్ని వ్యవస్థలను
మేనేజ్ చేశారని తెలిపారు. విద్యార్థి దశలోనే నీచ రాజకీయాలు చేశారని
ధ్వజమెత్తారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని,
హైదరాబాద్ అభివృద్ది పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని
ప్రస్తావించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రతీదీ స్కామేనన్న ఎంపీ.. అమరావతి,
పోలవరం సహా ఆయన చేసిన ప్రతి పనిలో కుంభకోణమేనని విమర్శించారు.
చంద్రబాబు ఓ స్కిల్డ్ క్రిమినల్ : చంద్రబాబు ఓ స్కిల్డ్ నేరస్థుడు. ఆయన
చేయని అరాచకాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా
బినామీ అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. రూ. 3000 కోట్లలో.. రూ. 2700 కోట్లు
ఇస్తామని సీమెన్స్ ఎప్పుడూ చెప్పలేదు. ఈస్కాంలో సుమారు రూ. 470 కోట్లు
కొట్టేశారు. ఒక్క రుపాయి కూడా ముట్టలేదని సీమెన్స్ చెబుతోంది. ఈ కుంభకోణం
చేసింది బాబే. దర్యాప్తు సంస్థల విచారణలో ఈ విషయం బయటపడింది. చంద్రబాబే
కుంభకోణానికి పాల్పడ్డాడని ఐటీశాఖ కూడా చెప్పింది. చంద్రబాబు నిజాయితీ పరుడైతే
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో విచారణ ఎదుర్కోవాలి. టీడీపీ మళ్లీ
అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వైఎస్ జగనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు స్కామ్‌లో
రామోజీ పాత్రపై విచారణ జరగాలి. బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ పురంధేశ్వరి
అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.