విజయవాడ : చంద్రబాబును అరెస్ట్ చేసిన 24 గంటల్లోనే కోర్టులో ప్రవేశపెట్టామని
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హౌజ్ కస్టడీ పిటిషన్‌ను
ఏసీబీ కోర్టు కొట్టేసింది. తీర్పు అనంతరం ఏఏజీ పొన్నవోలు మీడియాతో
మాట్లాడుతూచంద్రబాబు రిమాండ్‌పై ఆయన తరపు న్యాయ వాదులు తీవ్రమైన వాదనలు
వినిపించారు. సీఆర్పీఎస్ చట్టంలో రెండు కస్టడీ పిటిషన్లే ఉన్నాయి. ఒకటి పోలీస్
కస్టడీ, రెండవది జ్యుడీషియల్ కస్టడీ. హౌస్ కస్టడీ పిటిషన్ అనేది లేదని ఆయన
స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రలో జైలులో భద్రత లేదని వారి ఆరోపణ. చంద్రబాబు
జైల్లో ఉన్న ప్రాంతం ఒక కోటలా మారింది. ప్రత్యేకంగా ఒక బ్యారెక్స్‌ను
కేటాయించారు. 24×7 గంటలూ సీసీ కెమెరాల నిఘా, వైద్యులు అందుబాటులో ఉన్నారు.
చంద్రబాబు భద్రత ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుంది. సెంట్రల్ జైల్ అంటేనే
పటిష్టమైన భద్రతా ప్రదేశం. ప్రైవేట్ గృహంలో ఉంటేనే భద్రత ఉండదు. అక్కడ ఏదైనా
జరగొచ్చు. అదే జైల్లో ఉంటే ఎలాంటి భద్రతా పరమైన సమస్యా ఉండదు. జైల్లో ఫలానాది
లేదని చెప్పమనండి. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు
పేరు లేదనే వాదన సరైనది కాదు. బేసిక్ లా తెలియని వారు చట్టంపై అవగాహన లేని
వారు చెప్పే మాటలే ఇవి అని ఏఏజీ పేర్కొన్నారు. ఎంక్వైరీలో పేరు ఉందా లేదా
అనేదే ముఖ్యం. తనను ఉదయం 6 గంటలకే అరెస్ట్ చేశారని చంద్రబాబే కోర్టులో
అంగీకరించారు. చంద్రబాబు ఇటీవల పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానన్నారు.
ఇప్పుడు తన అరెస్ట్ కేసులో హౌస్ కస్టడీ పిటిషన్ కోరడం ద్వారా ఖైదీలకు ‘‘వర్క్
ఫ్రమ్ హోం’’ అనే మెసేజ్‌ను ఇచ్చినట్లుంది. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి
కోరుతూ పిటిషన్ వేశాం. బుధవారం చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ వేసే అవకాశం
ఉందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు.