రాజమహేంద్రవరం : చంద్రబాబు స్కిల్ స్కాంపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని
భరత్ కూడా స్పందించారు. రాజమండ్రితో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ స్కిల్
డెవలప్మెంట్ స్కీమ్‌లో అవినీతి జరగలేదని టీడీపీ నాయకులు ఎందుకు చెప్పడం
లేదు. స్కిల్ కుంభకోణంలో లేమనే చెబుతున్నారు కానీ, స్కాం జరిగిందని టీడీపీ
నేతలు చెప్పుకోవడం లేదన్నారు.
పోలవరం, అమరావతి స్కామ్‌లు : ఏపీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అత్యంత
సెక్యూరిటీ ఉంది. చంద్రబాబుకు వీవీఐపీ కంటే అత్యంత సెక్యూరిటీ కల్పించామని
జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే నివేదిక ఇచ్చారు. చంద్రబాబుకు హౌస్ కస్టడీ
దేనికి. ఇవన్నీ జైలు నుంచి బయటకు వచ్చేందుకే చేసే ప్రయత్నాలు మాత్రమే.
చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించడం సరికాదు. స్కిల్
డెవలప్మెంట్ స్కామ్ జీఎస్టీ ఇచ్చిన నోటీసు వల్ల బయటపడింది. స్కిల్ స్కామ్
మాత్రమే కాదు. పోలవరం, అమరావతి భూముల స్కాములు కూడా ఉన్నాయి. ప్రభుత్వం
చంద్రబాబుకు కావాల్సిన ప్రతీ సౌకర్యాన్ని కల్పించిందన్నారు.
పవన్ చీకటి ఒప్పందం : చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు చీకటి ఒప్పందం ఉంది. అది
ప్యాకేజీ ఒప్పందం. టీడీపీ నేతలు ఏపీలో బంద్ పేరు చెప్పి షాపులను మూసివేయాలని
బ్రతిమాలుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ కరెక్ట్ కావడం వల్లనే ప్రజలు
అంగీకరించారని, బంద్‌ను తిప్పికొట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్
పాలన చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.