అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే
పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మహిళా బిల్లు సాధన కోసం కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి
విజయవాడ : చారిత్రక అవసరమే మహిళా బిల్లు అని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో
మహిళా బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలపాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు
దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా
బిల్లు ప్రవేశ పెట్టాలని దుండ్ర కుమారస్వామి కోరారు. మహిళా బిల్లు సాధన కోసం
కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మహిళా బిల్లు, బీసీలకు
ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని అన్ని రాజకీయ
పార్టీలు ఒత్తిడి తీసుకు రావాలన్నారు. మహిళలకు విస్తృత అవకాశాలు లేకపోతే దేశ
ప్రగతి కూడా సాధ్యం కాదనే విషయం కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
సెప్టెంబర్ 18 నుంచి నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లో సుదీర్ఘకాలం
పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా ఏకమై అన్ని
పార్టీలు మద్దతు ఇవ్వాలని దుండ్ర కుమారస్వామి కోరారు.మంగళవారం కార్యక్రమం
సమన్వయకర్తగా తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు రుబిన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ
సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి ప్రసంగిస్తూ బీజేపీ కూటమితో
పాటు ఇండియా కూటమి, ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లుకు ఆమోదం తెలపడానికి
కదలిరావాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయమే జరుగుతోందని
దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ఇప్పటికే మంచి మద్దతు లభించిందని దుండ్ర
కుమారస్వామి తెలిపారు. మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టసభల్లో మహిళలకు
రిజర్వేషన్లు లభించడం ద్వారా వారి అభివృద్ధికి మరింత తోడ్పాటు ఇచ్చే అవకాశం
కలుగుతుందని అన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని దుండ్ర కుమారస్వామి
డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ చేసే కుట్రల విషయంలో కూడా ఇతర పార్టీలు
కాస్త ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం
నుంచి పలువురు యువ నేతలు పాల్గొన్నారు.