సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి
విజయవాడ : గత ప్రభుత్వ పెద్దలే స్కిల్ డెవలప్స్కామ్కు తెరలేపారని సీఐడీ
తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి చర్చ
లేకుండా ఎంఓయూ కుదుర్చుకుని ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. అసలు డీపీఆర్
లేకుండా ప్రాజెక్ట్ ఫండ్స్ ఇవ్వాలని ఆదేశించారన్నారు. చట్టం ముందు అందరూ
సమానమేనన్నారు ఏఏజీ పొన్నవోలు. చంద్రబాబు హౌజ్ అరెస్ట్ పిటిషన్పై విచారణను
మంగళవారం కి ఏసీబీ కోర్టు వాయిదా వేసిన అనంతరం పొన్నవోలు మీడియాతో
మాట్లాడారు. ‘రాజమండ్రి జైలువద్ద చంద్రబాబుకు భారీ భద్రత ప్రభుత్వమే
కల్పించింది. ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కంటే ఎక్కువ సెక్యూరిటీ కల్పించాం. 24
గంటలు వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. సీఆర్పీసీ చట్టంలో అసలు హౌజ్
అరెస్టు అనేది లేదు. ప్రజల సొమ్మును దోపిడీ చేసి షెల్ కంపెనీలకు మళ్లించారు.
స్కాం ఎలా జరిగిందో నోట్ ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. రూ. 371 కోట్ల రాష్ట్ర
ఖజానా దోపిడీకి గురైందని తెలిపారు.