భూముల పక్కనుండి రింగ్ రోడ్ వెళ్లేలా ప్లాన్
స్కిల్ స్కాంకి సూత్రధారి చంద్రబాబే
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడేనా?
జగన్ కేసులు వేరు, చంద్రబాబు కేసులు వేరు
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
గుంటూరు : చంద్రబాబేమీ యుగపురుషుడు కాదని, చేసిన తప్పును ఒప్పుకుని
పొరపాటయిందని చెప్పి చెంపలకు వేసుకోవాల్సింది పోయి జనాన్ని రెచ్చగొట్టడమేంటని
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏపీ స్కిల్
డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుని రిమాండుకు తరలించడంపై మంత్రి బొత్స
సత్యనారాయణ స్పందిస్తూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం
పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని అమరావతిలో రాజధాని నిర్మిస్తానని
చెప్పి బడుగు, బలహీన వర్గాల వారి నుండి భూములు దోచుకున్నారన్నారు. తాత్కాలిక
నిర్మాణాల పేరుతో కట్టిన టిట్కో ఇళ్ల దగ్గర్నుంచి సెక్రటేరియట్ వరకు
అన్నిటిలోనూ దోపిడీ చేశారని తెలిపారు. ఈ స్కాంలో కొనుగోలు చేసిన తమ భూముల
పక్కనుండి రింగ్ రోడ్ వెళ్లేలా ప్లాన్ రూపొందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే
చంద్రబాబు ప్రతిదానిలోనూ అవినీతికి పాల్పడ్డారని దోపిడీ చేసిన దొంగ జైలుకు
పోతే బంద్కు పిలుపు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. తాను నిజంగా తప్పు చేయకపోతే
మమ్మల్ని విమర్శించడం కాదు చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో భారీగా అవినీతి జరిగిందని అధికారాన్ని
అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు చేశారని అన్నారు. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో
ఉన్న చంద్రబాబు కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని ఇప్పు మాత్రం ఏమీ
తెలియదన్నట్లు అది క్యాబినెట్ నిర్ణయమని చెప్పి తప్పించుకోవాలని చూస్తే
కుదరదన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దోపిడీ జరిగిందో లేదో
చూసుకోవాలి కదా అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కిల్
సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పే టీడీపీ నేతలు అసలు ఎంతమందికి ట్రైనింగ్
ఇచ్చారో లెక్క చెప్పాలని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో నివేదించాలని కోరారు. ఈ
వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా తానేదో యుగపురుషుడిని అన్నట్టు చంద్రబాబు
మాట్లాడితే ఎలాగని ప్రశ్నిస్తూనే చంద్రబాబు దోపిడీ చేసి దొరికిపోయిన దొంగని
అన్నారు.
చెంపలు వేసుకోవాల్సింది పోయి : ఇలా గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఇద్దరు
ముగ్గురు సీఎంలు, మంత్రులు కూడా జైలుకు పోయారని వారికంటే చంద్రబాబు ఏమీ
గొప్పవాడు కాదని అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడి చేసిన తప్పుకు
పశ్చాత్తాప పడి చెంపలు వేసుకోవడం మానేసి ధర్నాలు చేయండి, బందులు చేయండని
జనాన్ని పిలుపునిస్తారా అని ప్రశ్నించారు. భారీ కుంభకోణాలకు పాల్పడింది మీరు.
దోపిడీలు చేసింది మీరు.. మీరు అక్రమాలు చేసి జైలుకు పోతే జనం బందులు చేయాలా?
ఇదెక్కడి న్యాయామని ప్రశ్నించారు. ఏపీ ఫైబర్ నెట్, టిట్కో ఇళ్లలో ఎంత అవినీతి
జరిగిందో కూడా పూర్తిగా విచారణ చేయాలి. టిట్కో ఇళ్లలో అడుగుకి 11 వేలు
తీసుకుని నిర్మాణం చేయటం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు.