అమరావతి : రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నరామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్
వే ఓడరేవు, మూలపేట ఓడరేవు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులపై
సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా నూతన
ఓడరేవుల నిర్మాణానికి సంబంధించిన పనుల ప్రగతిని సమీక్షించడం తోపాటు వాటికి
సంబంధించిన భూసేకరణ, పలు పెండింగ్ క్లియరెన్సులపై అధికారులతో సమీక్షించారు.
ఆయా పోర్టుల వారీ ప్రస్తుతం జరుగుతున్న పనులను సమీక్షించారు. తదుపరి భోగాపురం
అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ
సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్,ఎపి మారిటైం
బోర్డు సిఇఓ కె.ప్రవీణ్ కుమార్, అదనపు సిసిఎల్ఏ ఇంతియాజ్, ఎపి మారిటైమ్ బోర్డు
డిప్యూటీ సిఇఓ రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో లింక్ ద్వారా
శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.