చేయనున్న పద్మ పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వివిధ రంగాలకు
సంబంధించి 16 నామినేషన్లు రాగా వాటిని ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం కేంద్రానికి
సమర్పించనుంది. పద్మ అవార్డులు-2024కు సంబంధించి సోమవారం వెలగపూడి రాష్ట్ర
సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన
స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో పద్మ అవార్డులకు సంబంధించి
వివిధ రంగాల నుండి వచ్చిన 16 నామినేష్లను ఈ కమిటీ పరిశీలించి వాటిని కేంద్ర
ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం,
వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి పలు
రంగాల్లో అత్యుత్తమ సేవా నిరతిని కనబర్చిన వారికి 2024 గణతంత్ర
దినోవాత్సవాల్లో ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పద్మ
విభూషణ్ అవార్డుకు సంబంధించి కూచిపూడి క్లాసికల్ డాన్సు విభాగం నుండి 2
నామినేష్లను వచ్చాయి. అదే విధంగా పద్మశ్రీ అవార్డుకు సంబంధించి సామాజిక సేవ
విభాగంలో ఆర్కిస్ట్రక్చర్ అండ్ శిల్పకళ, డప్పు వాయిద్యం, ధియేటర్ ఆర్ట్స్ అండ్
డైరెక్టర్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, కర్నాటిక్ క్లాసికల్ సంగీతం, సాహిత్యం,
విద్య, వైద్య రంగాలకు 14 రాగా మొత్తం కలిపి 16 నామినేషన్లు వచ్చాయి.
సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,
జిఏడి కార్యదర్శి(పొలిటికల్) ఆర్.ముత్యాలరాజు, సమాచారశాఖ కమిషనర్
టి.విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.