అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారు
జనసేన పార్టీని పవన్ చంద్రసేనగా మార్చేశారు
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా
తిరుపతి, అభి మీడియా సొల్యూషన్స్ ప్రతినిధి : చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద
ఆర్థిక ఉగ్రవాదని ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజమెత్తారు. బోగస్
కంపెనీలతో దోచుకున్న కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో
కూరుకుపోయాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై కక్షసాధించే అవసరం తమకు
లేదనితెలిపారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టింది ప్రజల కోసమని పేర్కొన్నారు.
స్కిల్ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని రోజా దుయ్యబట్టారు. తన
అధికారాన్ని చంద్రబాబు దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు.
అధికారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపిందని తెలిపారు. స్కిల్
స్కామ్ జరగలేదని, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలిగారా? అని
ప్రశ్నించారు. బాబు లాయర్లు కుంటిసాకులపైనే వాదించారని అన్నారు.
పక్కా ఆధారాలతో దొరికితే కొందరు గగ్గోలు : ‘జీఎస్టీ అధికారులు చంద్రబాబుకు
లేఖ రాసిన మాటం నిజం కాదా? స్కిల్ స్కామ్‌లో ఈడీ విచారణ జరిపింది నిజం కాదా?
బాబుకు ఐటీశాఖ నోటీసులు ఇచ్చింది నిజం కాదా? పక్కా ఆధారాలతో దొరికితే కొందరు
గగ్గోలు పెడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఇన్నాళ్లూ
తప్పించుకున్నారు. దత్త పుత్రుడు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడరు?
టీడీపీ నేతలు, పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసి ఇంకా
బుకాయిస్తున్నారని విమర్శించారు.
స్కిల్డ్‌గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎం: టీడీపీ బంద్‌ను ప్రజలు
పట్టించుకోలేదు. సాక్ష్యాధారాలతో దొరికిపోయి బంద్‌కు పిలుపునిస్తారా?. సీఎం
జగన్ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు చెబితే అన్ని
స్కాంలే గుర్తొస్తాయి. చాలా స్కిల్డ్‌గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్
చేశారు. అమరావతిలో భూముల్ని దోచుకున్నారు. పోలవరం, పట్టిసీమ వరకు అవినీతి
చేశారు. ప్రజల నెత్తిన టోపీ పెట్టి నిధులు దోచేశారు. కక్షసాధింపులకు పాల్పడిన
చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు సానుభూతి రాజకీయాలు ప్రజలకు నమ్మరన్నారు.
బంద్‌కు పవన్ ఎందుకు మద్దతిచ్చారు? : జనసేన పార్టీని పవన్ చంద్రసేనగా
మార్చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తికి పవన్ మద్దతిస్తున్నారు. బీజేపీ
బంద్‌కు సపోర్టు చేయకున్నా పవన్ ఎందుకు మద్దతిచ్చారు?పవన్ పవర్ స్టార్
కాదు. ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్ మాట్లాడటం నిజం
కాదా? ప్యాకేజీ కోసమే పవన్ చంద్రబాబుకు మద్దతిచ్చారు. ముద్రగడను చంద్రబాబు
ఇబ్బందిపెట్టినప్పుడు పవన్ ఏమయ్యారు?. మీ అన్నయ్య చిరంజీవిని ఎయిర్‌పోర్టులో
ర్ట్ అడ్డుకున్నప్పుడు రోడ్‌పై దోర్ల లేదే. షెల్ కంపెనీల్లో పవన్‌కు కూడా
వాటా ఉన్నట్టుంది. దర్యాప్తులో అన్నీ బయటకొస్తాయి. అందరికీ ఒకటే చట్టం
ఉంటుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.