నెల్లూరు : వాచ్ కూడా లేదని చెప్పే చంద్రబాబు గంటకి రూ.కోటి రూపాయలు తీసుకునే
లాయర్ ఎలా వచ్చాడంటూ మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం
ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరిదిని కాపాడుకునేందుకు బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. బంధు ప్రీతి పక్కన
పెట్టి ఆమె మాట్లాడాలి. పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా అక్రమ కేసు అని ఎలా
చెబుతారు అంటూ అనిల్ దుయ్యబట్టారు. తన పార్టీ నేతను అరెస్ట్ చేసినట్లు పవన్
కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారు. నానా హంగామా చేశాడు. సుపుత్రుడు సైలెంట్ అయితే
దత్త పుత్రుడు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. అవినీతి అనకొండగా ఉన్న
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ముద్దాయి అయ్యాడని అనిల్
ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్ట్‌లో సీఎం జగన్ నిజాయితీగా వ్యవహరించారు. ఎవరు
తప్పు చేసినా వదలం అనే మెసేజ్‌ను ప్రజలకు పంపాం. బాబు మరో ఆరు జన్మలు ఎత్తినా
సీఎం అయ్యే అవకాశం లేదు. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ మూతపడటం ఖాయం అని అనిల్
పేర్కొన్నారు.