చిత్తూరు : కొంతకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సీకే
బాబు ఇంటికి బీసీవైపీ పార్టీ (భారత చైతన్య యువజన పార్టీ) చీఫ్ రామచంద్ర యాదవ్
వెళ్లారు. వీరిద్దరు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై
చర్చించారు. సీకే బాబును బీసీవైపీ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే తనకు కొంత
విరామం కావాలని త్వరలోనే తన నిర్ణయం చెబుతానని సీకే బాబు తెలిపారు. అనంతరం
రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. సీకేబాబును తన పార్టీలోకి
ఆహ్వానించినట్లు తెలిపారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే జగన్రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసిందని
ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో గవర్నర్ ఆమోదం
తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. స్కిల్ డెవలప్మెంట్
కేసులో నిజంగానే తప్పు చేసుంటే ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల
ముందు చంద్రబాబును ఎదుర్కొలేకే ఇలా అరెస్ట్ చేశారని రామచంద్ర యాదవ్
పేర్కొన్నారు.