శ్రీకాకుళం : నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు హై ప్రొఫైల్ నేరస్తుడని,
తప్పుచేస్తే పర్యవాసానాలు ఇలాగే ఉంటాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు ని ఏసీబి కోర్టు 14
రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ధర్మాన కృష్ణదాస్ ఆదివారం సాయంత్రం తనను
కలిసిన మీడియాతో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఎన్నో స్కామ్స్ చేసి వ్యవస్థలను
మానేజ్ చేసుకొని వస్తున్న చంద్రబాబు కథ అడ్డం తిరిగిందని తెలిపారు. ఎవరు ఎంత
మేనిప్యూలేట్ చేసినా న్యాయమే గెలుస్తుందని రుజువయిందని అన్నారు. మిగిలిన
స్కాముల్లో కూడా చంద్రబాబు అండ్ కో పాల్పడిన అక్రమాలపై దర్యాప్తు జరపాలని
తెలిపారు. తప్పుచేస్తే తనకైనా శిక్ష తప్పదన్నారు. అక్రమాలకు పాల్పడలేదన్న
విషయాన్ని చట్టప్రకారం కోర్టుకు నివేదించుకునే అవకశం కూడా చంద్రబాబుకు ఉందని,
అది మర్చిపోయి ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నించటం సమంజసం కాదని కృష్ణ దాస్
చెప్పారు.