అమరావతి : ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వాదనలు
వినిపించారు. వాదనలకు అవకాశమివ్వాలని ఆయన కోరగా న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
తన అరెస్ట్ అక్రమమని, స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం
లేదని న్యాయమూర్తి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. రాజకీయ కక్షతోనే అరెస్ట్
చేశారని ఆయన చెప్పారు. ‘‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు
కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి
వీల్లేదు. స్కిల్ డెవలప్మెంట్కు 2015-16 బడ్జెట్లో పొందుపర్చాం. రాష్ట్ర
అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను
క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్ఐఆర్లో నా పేరు
లేదు. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ నా పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదని
చంద్రబాబు తన వాదనలు వినిపించారు.