టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ
రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్రబాబు అక్రమ
అరెస్ట్, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు
నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో సామూహిక నిరాహార
దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ సైకో చర్యలకు నిరసనగా
చేపడుతున్న ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని
విజయంవంతం చేయాలని పిలుపునిచ్చారు.