గుంటూరు : ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ కార్పొరేషన్ లో లేని ప్రాజెక్ట్ ను
ఉన్నట్టుగా సృష్టించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.371 కోట్ల
అవినీతికి పాల్పడ్డాడని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఈ అంశంపై స్పందించారు.
స్కిల్ డెవలప్మెంట్ లో సీమన్స్ సంస్థ పేరు వాడుకుని లేని ప్రాజెక్ట్ను
ఉన్నట్టుగా సృష్టించి పథకం ప్రకారం చంద్రబాబు రూ.371 కోట్ల కొల్లగొట్టాడని
అన్నారు. కాస్త ఆలస్యం అయితే అయ్యుండొచ్చని, అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో
జరిగిందని అన్నారు. చంద్రబాబు ఇది ఆరంభం మాత్రమేనని తెలుసుకోవాలని అన్నారు.
చంద్రబాబు అండ్ కో జీవితాంతం జైల్ లో నే ఉండాల్సినన్ని నేరాలతోకూడిన స్కాం లు
చేశారని అన్నారు. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ కి కూడా చట్టం
వర్తిస్తుందని, ఇన్నాళ్లూ తప్పించుకోగలిగినా ఇప్పుడు శిక్షా సమయం ఆసన్నమైందని
విజయసాయిరెడ్డి అన్నారు.