పోలీసులు అరెస్టు చేశారు. తొలుత నంద్యాలలోని ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్ద ఆయన
బస చేసిన బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి అదుపులోకి
తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్టు
చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన
కాన్వాయ్‌లోనే ఎన్ఎస్జీ భద్రతతో విజయవాడ తరలిస్తున్నట్లు తెలిపారు.
అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. విజయవాడలోని ఏసీబీ
కోర్టులో చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉంది.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు : చంద్రబాబు అరెస్టుపై ఆయన తరపు
న్యాయవాది స్పందించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. వైద్యపరీక్షల్లో
చంద్రబాబుకు హైబీపీ, షుగర్ ఉంది. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్‌కు ప్రయత్నం
చేస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కేసుతో సంబంధం లేని
సెక్షన్లు నమోదు చేశారు. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా
పేర్కొన్నారని తెలిపారు.
రాత్రంతా హైడ్రామా : అంతకుముందు చంద్రబాబు బస చేసిన ఆర్.కె.ఫంక్షన్ హాల్
వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రబాబు బస
చేస్తున్న ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి
పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ
కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ
రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు,
చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఆర్.కె
ఫంక్షన్ హాల్ వద్దకు భారీగా తరలివచ్చాయి. శనివారం ఉదయం 5 గంటల తర్వాత
చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వాహనం
చుట్టూ ఉన్న టీడీపీ నేతలను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో కాలవ
శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి,
ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర స్థానిక టీడీపీ నేతలు
ఉన్నారు. బస చేసిన బస్సు నుంచి చంద్రబాబు కిందికి రావడంతో పోలీసులు ఆయనతో
మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు.