తిరుమల : శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా
రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయించడం జరుగుతుంది.
దాతల సిఫార్సుపై ఇతరులకు గదుల కేటాయింపు ఉండదు. తిరుమలలో సెప్టెంబరు 18
నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ
తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దాతలు
tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా గదులను రిజర్వు చేసుకోవాల్సి
ఉంటుంది. సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల
బ్రహ్మోత్సవాల్లో సెప్టెంబరు 22న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో
ఉంచుకుని సెప్టెంబరు 20 నుండి 22వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల
కేటాయింపు ఉండదు. అదేవిధంగా, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి
19వ తేదీ వరకు కాటేజి దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదు. ఒకే కాటేజిలో రెండు
గదుల కంటే ఎక్కువగా విరాళం ఇచ్చిన దాతలు స్వయంగా వస్తే రెండు గదులను రెండు
రోజుల పాటు కేటాయిస్తారు. ఒకే కాటేజిలో ఒక గదిని విరాళంగా ఇచ్చిన దాతలు
స్వయంగా వస్తే ఒక గదిని రెండు రోజులపాటు కేటాయించడం జరుగుతుంది. ఈ విషయాన్ని
కాటేజి దాతలు గమనించాలని టీటీడీ కోరుతోంది.