గుంటూరు : ఉచితంగా ఇసుక అలాగే తక్కువ ధరకే సామగ్రి ఇచ్చినా, చదరపు అడుగు
నిర్మాణ ధర రూ. 1000 రూపాయలు కూడా దాటని టిడ్కో ఇళ్లకు సగటున రూ.2203 గా
నిర్ణయించి చంద్రబాబు పేదల ఇళ్లలోనూ పేలాలు ఏరుకున్నాడని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా
వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. 2017 లో చంద్రబాబు రెండింతలు ధర
పెంచి కాంట్రాక్టులు కట్టబెట్టాడని అన్నారు. 2,08,160 ఇళ్ల కాంట్రాక్టులో రూ.
8,929.81 కోట్లు అక్రమాలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి
కల్పించడంలో ఎంఎస్ఎంఈ లు రికార్డు సృష్టించాయని విజయసాయి రెడ్డి అన్నారు.
కేవలం ఐదు నెలల్లో 97,378 యూనిట్లు ఏర్పాటు చేసి 7.01లక్షల మంది స్థానికులకు
ఉపాధి కల్పించాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో ప్రపంచ శక్తిగా మన
దేశ స్థాయి మరింతగా పెరుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు.