అమరావతి : ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా చంద్రబాబు అని
వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి సవాల్
విసిరారు. ఐటీ నోటీసులపై మౌనం దాల్చడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన
వెంకటరెడ్డి ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం అర్ధాంగీకారమేనని తేల్చిచెప్పారు.
తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. లక్షల కోట్లు దోచేసిన
బాబు అడ్డంగా దొరికేశాడు. అవినీతిపై ఎవిడెన్స్ లేదంటాడు కానీ, తప్పు చేయలేదని
చెప్పడు. దర్యాప్తు ఆలస్యం కావ్వొచ్చు. కానీ బాబు జైలుకు పోవటం ఖాయం. తేలు
కుట్టిన దొంగల్లా దుష్ట చతుష్టయం అని వెంకటరెడ్డి విమర్శించారు.