గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ జారీ చేసిన
నోటీసులపై ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎందుకు
స్పందించడం లేదని వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ప్రశ్నించారు. ఎంపీ మాట్లాడుతూ
అవినీతి కుంభకోణంలో మెల్లగా చంద్రబాబు మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని
తప్పించుకునే దారిలేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఈ సందర్బంగా ఐటీ
శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎందుకు మౌనంగా ఉన్నారని
ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పవన్‌కు ఏమైనా ముడుపులు అందాయా ఏమిటని
ప్రశ్నించారు. ఐటీ శాఖ నోటీసులు పంపించడంతో చంద్రబాబు బాగోతం వెలుగులోకి
వచ్చిందని చంద్రబాబు ఐటీ నోటీసులపై సమాధానం చెప్పకుండా తేలుకుట్టిన దొంగలా
తప్పించుకుని తిరుగుతున్నారన్నారు ఎంపీ నందిగం సురేష్. ఇప్పటికైనా ఆలస్యం
కాలేదని చంద్రబాబు తన తప్పును ఒప్పుకుంటే మంచిదన్నారు. అవకాశం దొరికితే
తెలుగువారి ఆత్మగౌరవం అంటూ లెక్చర్లు ఇచ్చే టీడీపీ అధినేత ఇప్పుడు దానిని
ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు. బహుశా ఆయనకు తన భవిష్యత్తు కనిపించి
ఉంటుందన్నారు. నారా లోకేష్ తన తండ్రికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై
స్పందించాలన్నారు. పరిపక్వత లేని రాజకీయం చేస్తూ రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు
సృష్టిస్తున్నారని విమర్శించారు. అసలు ఆయన చేసేది పాదయాత్ర అంటారా? అని
ప్రశ్నించారు. లోకేష్ కూడా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.