పౌరుల ఆరోగ్య అవసరాలు గుర్తించేందుకు, పరీక్షలు నిర్వహించేందుకు సెప్టెంబరు
16 నుంచి ఏ.ఎన్.ఎం./సి.హెచ్.ఓ.ల ఇంటింటి సర్వే
సెప్టెంబరు 30 నుంచి మండలాల వారీగా ఆరోగ్య శిభిరాలు : సీఎస్ డా. కె.ఎస్.
జవహర్ రెడ్డి
వెలగపూడి సచివాలయం : ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే
లక్ష్యంతో వచ్చే నెల 15 నుండి ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
డా.కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వెలగపూడిలోని
ఆంధ్రప్రదేశ్ సచివాలయం సి.ఎస్. కాన్సరెన్సు హాల్ లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం,
ఆరోగ్యశ్రీ ట్రస్టు, పాఠశాల విద్య, మహిళా అభివృద్ది, శిసు సంక్షేమం, పురపాలక,
పట్టణాభివృద్ది శాఖల అధికారులతో ఆయన సమావేశమై ఈ కార్యక్రమ నిర్వహణకు శాఖల
వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని
లైన్ డిపార్టుమెంట్ల అధికారులు అందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ మంచి ఫలితాలను
సాదించేలా కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన
కల్పించేందుకు సెప్టెంబరు 15 నుండి వాలంటీర్ల ఇంటింటి ప్రచారము, 16 నుండి
ఏ.ఎన్.ఎం./సి.హెచ్.ఓ.ల ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారికి అవసరమైన
శిక్షణనను, ప్రచారం సామాగ్రిని, టెస్టింగ్ కిట్లను, ఔషధాలను, అవసరమైన ఇతర
సామాగ్రిని ముందుగానే వారికి అందజేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్
సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబకు ఆయన సూచించారు. ఆరోగ్య సింబ్బంది ఇంటింటి సర్వే
నిర్వహించే సమయంలో సాదారణ వ్యాధులతో పాటు దీర్ఝకాలిక వ్యాధులు, గర్బిణీలు,
బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు, సంక్రమంచని, సంక్రమించే
వ్యాధులతో బాదపడేవారిపై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలన్నారు. ప్రత్యేకించి
గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా, మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులపై
ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడ ప్రజలకు
పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారిలో ఎటు వంటి ఆరోగ్య సమస్యలు
ఉన్నా వెంటనే తగు వైద్యసేవలు అంజేయాలని పురపాల, పట్టణాభివృద్ది శాఖ కమిషనర్
కోటేశ్వరరావును ఆదేశించారు. ముఖ్యంగా శిశువులు, బాలలు, యుక్త వయస్సుల్లోని
బాలికలు, మహిళలు, గర్బిణీలు, బాలింతలు ఎటు వంటి రక్తహీనతకు గురికాకుండా తగు
పోషక విలువలతో కూడిని ఆహారాన్ని అందజేయాలని మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ
ప్రిన్సిఫల్ సెక్రటరీ జయలక్షికి ఆయన సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని
విద్యార్థులకు ఈ వైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధులతో బాధపడే విద్యార్థులను
గుర్తించి, వారికి కూడా తగు వైద్య సేవలు అందజేసేలా తగు చర్యలు తీసుకోవాలని
పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కు ఆయన సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నున్న మహిళా పొదుపు సంఘాల సభ్యులు అందరినీ ఈ కార్యక్రమంలో
విస్తృత స్థాయిలో భాగస్వామ్యులను చేసి, ఈ వైద్య శిభిరాలను సద్వినియోగం
చేసుకునేలా వారిని మోటివేట్ చేయాలని సెర్పు సి.ఇ.ఓ. ఇంథియాజ్ ను
సి.ఎస్.ఆదేశించారు.
సెప్టెంబరు 30 నుండి ప్రతి మండలంలో రోజుకి కనీసం
ఒక వైద్య శిభిరం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నున్న 685 మండలాల్లో ప్రణాళికా
బద్దంగా ఈ శిభిరాలు నిర్వహించేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను
రూపొదించాలని ఆరోగ్య, కుటుంభ సంకేమ శాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ
శిభిరాల్లో సాధారణ వైద్యులతో పాటు ఆర్థో, గైనకాలజీ, పీడియాట్రిక్స్ తదితర
విబాగాల వైద్య నిపుణులు పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి
మండలంలోనూ నిర్వహించే ఈ వైద్య శిభిరాల్లో సంబందిత మండల ఎం.పి.డి.ఓ.,
ఎం.ఆర్.ఓ., స్థానిక పి.హెచ్.సి. వైద్యులు తప్పని సరిగా పాల్గొనెలా
చూడాలన్నారు. ఈ శిభిరాలకు వచ్చే రోగులకు అవసరమైన ఔషధాలను వెంటనే అందజేయాలని,
అందుకు అవసరమైన ఔషదాలు అన్నింటినీ ముందుగానే నిల్వ ఉంచుకోవాలన్నారు. అందుకు
తగ్గట్టుగా ముందుగానే తగిన పరిమాణంలో ఔషధాలను కొనుగోలు చేసుకుని సిద్దంగా
ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అనుమతులు, నిధులను
సమకూర్చేందుకు తాను సిద్దంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఎటు వంటి
విమర్శలకు తావు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ విజయవంతం
చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు రూపొందించిన
కార్యాచరణ ప్రణాళికను, ఇప్పటి వరకూ పూర్తి చేసిన పనుల ప్రగతిని, శాఖల వారీగా
నిర్వహించాల్సిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఆరోగ్య,
కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ జె.నివాస్,
ఆరోగ్యశ్రీ ట్రస్టు సి.ఇ.ఓ. హరేంద్రప్రసాద్ సి.ఎస్.కు వివరించారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
స్పెషల్ సి.ఎస్. ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ ట్రస్టు
సి.ఇ.ఓ. హరేంద్రప్రసాద్, రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ప్రవీణ్
ప్రకాష్, పురపాల, పట్టణాభివృద్ది శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, మహిళా అభివృద్ది,
శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జయలక్షి, సెర్పు సి.ఇ.ఓ. ఇంథియాజ్
తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.