చేయాలి-ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా
మచిలీపట్నం : రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ మంత్రి, జిల్లా
ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ పి
రాజాబాబు లతో కలిసి గురువారం ఉయ్యూరు మండలం ఆకునూరులో ప్రైవేట్ ఫంక్షన్ హాల్
లో పెనమలూరు నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో వివిధ
ప్రభుత్వ శాఖల ద్వారా అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శాఖల వారీగా
సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
నియోజకవర్గం సమస్యలు ప్రస్తావించారు. పెనమలూరు నియోజకవర్గంలో గృహ నిర్మాణ
ప్రగతి చాలా బాగుందని, అయితే మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, మరింత పురోగతి
సాధించాలన్నారు. ఇంకా ప్రారంభం కానీ గృహ నిర్మాణాలపై కారణాలు చెప్పాలన్నారు.
సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పనితీరు సమీక్షించాలని తెలుపగా, వారితో
వెంటనే సమావేశం నిర్వహించి వారిని మోటివేట్ చేయాలని కలెక్టర్ అధికారులకు
సూచించారు. ఉయ్యూరులో పంచాయతీరాజ్ డిఇ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో కార్యాలయం
భవనాల నిర్మాణం చేపట్టుటకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. కంకిపాడు
మండలం కుందేరులో బ్రిడ్జి నిర్మించి ఐదేళ్లు గడిచినా ఇంకా వినియోగంలోకి
రాలేదని, వినియోగంలోకి తేవాలని, తెన్నేరులో బ్రిడ్జి కూలిందని, బ్రిడ్జి
మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రత్యామ్నాయ మార్గం చర్యలు
చేపట్టాలన్నారు. నియోజక వర్గంలో ఈ క్రాప్ నమోదు వేగవంతం గావించాలని, ఈ కేవైసీ
పూర్తి చేయాలని, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది లేకుండా దాన్యం రవాణా
ఏజెన్సీలు ముందుగానే ఫిక్స్ చేయాలని, అవసరమైన గోని సంచులు ముందుగా సిద్ధం
చేయాలని అన్నారు. ఉయ్యూరులో పకీర్ చావడి ప్రాంతంలో వక్ఫ్ భూముల
రిజిస్ట్రేషన్లు ఆగాయని, సమస్య పరిష్కరించాలని, మద్దూరులో లంక భూములు అర్హులైన
వారికి పట్టాలు ఇప్పించాలని కోరారు. నియోజకవర్గంలో ఓటీఎస్ లో కవర్ కాని వారికి
హక్కులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు
వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ మంజూరు
చేయాలని, మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లకు సిబ్బందిని పెంచాలని, మున్సిపల్
కార్యాలయ భవనానికి, డంపింగ్ యార్డ్ కోసం అవసరమైన స్థలాలు గుర్తించాలన్నారు.
పెనమలూరులో పిహెచ్సి ఏర్పాటుకు కేంద్ర నిధులు మంజూరు చేసిందని స్థల పరిశీలన
గావించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో
గల ఏడు నియోజకవర్గాల్లో ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం పెనమలూరు నియోజకవర్గం
సమీక్ష శాఖా పరమైన అంశాలపై శాఖల వారీగా పి పి టి ద్వారా నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాసనసభ్యులు ప్రస్తావించిన
సమస్యలు అంశాలపై పరిష్కార చర్యలు తీసుకోవాలని నివేదికలు సమర్పించాలని కలెక్టర్
అధికారులను ఆదేశించారు.
అనంతరం ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం
అన్నారు. జగనన్న ఇచ్చిన హామీలు నాలుగేళ్లలోనే అమలుచేసి దేశంలోనే మొదటి 5
రాష్ట్రాల్లో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టారని అన్నారు. రైతులు
పండిస్తున్న పంటలు ఈక్రాప్ లో నమోదు ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయాలని
వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు సమస్యలు రాకుండా
చూడాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియకు మిల్లర్లు తూట్లు పొడిచి ప్రభుత్వానికి
చెడ్డ పేరు వచ్చేలా చేస్తే సహించేది లేదని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని
కలెక్టరుకు సూచించారు. జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న గృహాలు, టిట్కో గృహాల
నిర్మాణం పరుగులు పెట్టించాలని అధికారులను ఆదేశించారు.
సాగునీటి కాలువల నిర్వహణ పనులకు ఫిబ్రవరి మాసంలోనే టెండర్లు పిలిచి ఏప్రిల్,
మే మాసాల్లోనే పనులు పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలన్నారు. పేద
కుటుంబాలకు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజాప్రతినిధులను గడపగడపకు
ప్రభుత్వం పంపించి వారి సమస్యలు తెలుసుకుని, వారికి సంక్షేమ పథకాలు
అందిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారి అర్హతను బట్టి జగనన్న
సురక్ష పథకం ద్వారా వారికి అవసరమైన ధ్రువపత్రాలు ఉచితంగా అందించి అర్హులందరికీ
సంక్షేమ పథకాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో
పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, కేడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ తాతినేని
పద్మావతి, కంకిపాడు ఎంపీపీ రాజ్యలక్ష్మి, జడ్పిటిసి బాకీ బాబు, డిఆర్ఓ ఎం
వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో జ్యోతి బసు, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ
పరిధిలో పలువురు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు