విజయవాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చిన ఇదే అంశంపై మాజీ
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా
అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్
చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం
లేదని ప్రశ్నించారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వచ్చిందా. పాలు, పిడకలు
అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే
చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన
మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలు చెప్పాలి. అంతే తప్ప చంద్రబాబు
సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవడమేంటో నాకైతే అర్ధం
కాలేదన్నారు. మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానంటారు కానీ చంద్రబాబు అక్కడ
పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టలదొర లేని లోటుని ఆయన
తీరుస్తున్నారని రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని
కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.