గుంటూరు : చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తారని చెప్పుకుంటూ ప్రజల్లో
సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని, తప్పుచేశారు కాబట్టే ఆయన
భయపడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన నేరానికి ఐటీశాఖ నోటీసులు
జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టు భయం పుట్టుకున్న చంద్రబాబు ప్రజల
వద్ద సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. చట్టం
దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని చట్టం తన పని తాను
చేసుకుంటూపోతుందని ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని నాకు
అనిపిస్తోందన్నారు. బహుశా ఆయనను అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది.
చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారు, అరెస్టు
చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని అన్నారు. అలాగని చట్టానికి అడ్డం
వస్తే ఆయన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ
విధమైన కేసులు పెట్టరని అన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు ప్రజల్లో
సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్
నోరు విప్పడు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా
కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు సరికదా ఆయన హీరోనే అంటాడని వాళ్ళిద్దరికీ ఉన్న
సంబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు.