పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
తెనాలి : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ప్రజల ఆలోచన విధానానికి
ప్రతిబింబం ఓటు. చట్టసభల్లోకి తమ తరఫున ఎవరిని పంపించాలనే నిర్ణయం ఓటు పైనే
ఆధారపడి ఉంటుంది. ఈసారి రాష్ట్రంలో యువత వేసే ఓటు కీలకం. వారి నిర్ణయమే వచ్చే
ఎన్నికల్లో శిరోధార్యం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు
లక్షల మంది యువత కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు. వారంతా మొదటి ఓటును తమ
భవిష్యత్తును బంగారుమయం చేసే జనసేన పార్టీకి వేస్తారని ఆశిస్తున్నాం. వచ్చే
ఎన్నికల్లో మొదటి ఓటును వినియోగించుకోనున్న యువతలో చైతన్యం నింపేలా జనసేన
పార్టీ రాష్ట్ర వ్యాప్త క్యాంపెయిన్ ను నేటి నుంచి మొదలుపెట్టనుంది. “మై ఫస్ట్
వోట్ ఫర్ జనసేన ” పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ చైతన్య
కార్యక్రమాన్ని నిరంతరాయంగా యువతలోకి తీసుకువెళ్తామ’ని జనసేన పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో
గురువారం మై ఫస్ట్ వోట్ ఫర్ జనసేన క్యాంపైన్ పోస్టర్లను కళాశాల విద్యార్థులతో
కలిసి మనోహర్ ఆవిష్కరించారు. విద్యార్థులతో మాట్లాడి మీ మిత్రులు ఓటు నమోదు
చేసుకునేలా ప్రోత్సహించాలని, మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి మీ బలమైన సహకారం
అందించాలని కోరారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాల గురించి ఎంతో
ఉన్నతమైన ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ అడుగుజాడలు యువతకు ఎంతో స్ఫూర్తి. ఆయన
ఆలోచనలను అందిపుచ్చుకునే యువతరం రాష్ట్రంలో ఉన్నారు. వారి భవిష్యత్తుకు భరోసా
కల్పించేలా, ఒక ఉన్నతమైన దారిని ఏర్పాటు చేసేలా పవన్ కళ్యాణ్ నిత్యం
ఆలోచిస్తారు. అలాంటి నాయకుడికి అండగా నిలిచేలా వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటు
వేయనున్న యువత జనసేన పార్టీకి అండగా నిలబడాలి. వారి మద్దతు జనసేన పార్టీకి
మరింత బలం తీసుకొస్తుంది. నేటి యువతరం ఉన్నతమైన ఆలోచన చేసి జనసేన పార్టీకి
అండగా నిలబడాలి. మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి పవన్ కళ్యాణ్ కి మద్దతుగా
నిలవండి. ఈ చైతన్య కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని
నియోజకవర్గాల్లోనూ బలంగా తీసుకుని వెళ్తాం. యువతను దీనిలో భాగస్వామ్యం
చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు
రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, మాజీ కౌన్సిలర్లు హరిదాసు
గౌరీ శంకర్, షేక్ జాకీర్ హుస్సేన్, జనసేన నాయకులు పసుపులేటి మురళీకృష్ణ,
తెనాలి మండల అధ్యక్షులుదివ్వెల మధుబాబు, కొల్లిపర మండల అధ్యక్షులు యర్రు
వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.