వాసవి క్లబ్ ఆదర్శ మహిళ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సత్కారం
విజయవాడ పశ్చిమ : సమాజానికి జర్నలిస్టుల సేవలు ఎంతో విలువైనవని అలాంటి వారిని
సత్కరించటం సామాజిక బాధ్యత అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లు అన్నారు. వాసవి క్లబ్ ఆదర్శ మహిళ అధ్యక్షురాలు
గ్రంధి రాజరాజేశ్వరి ఆధ్వర్యంలో బుధవారం వాసవి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే
సందర్భంగా ఆంధ్ర పత్రిక విజయవాడ బ్యూరో చీఫ్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు,
వార్తా ప్రభ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు యేమినేని వెంకట రమణ లను తమ క్లబ్
తరఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి
శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి లు ఈ కార్యక్రమంలో ముఖ్య
అతిథులుగా పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించిన వాసవీ క్లబ్ మహిళా
నాయకురాళ్లను సన్మాన గ్రహీతలు వారు అభినందించారు. ఈ సందర్భంగా వాసవీ క్లబ్
ఆదర్శ్ అధ్యక్షురాలు గ్రంధి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సమాజాన్ని మంచి దిశగా
పయనింపచేయడంలో జర్నలిస్టుల కృషి ఎంతో ఉందని అన్నారు. తన వాసవి క్లబ్ తరఫున
ప్రతిఏటా జర్నలిస్టులను సత్కరించుకోవడం తమకు ఎంతో సంతోషకరమని చెప్పారు. ఈ
కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆదర్శ మహిళ కార్యదర్శి దోరడ్ల కవిత, కోశాధికారి
బొమ్మిశెట్టి కవిత తదితరులు పాల్గొన్నారు.