పీసీసీ అధ్యక్షునికి ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి
విజయవాడ : ఎస్సీ వర్గీకరణతోనే దళితులు అందరికీ సమ న్యాయం జరుగుతుందని, అందుకే
వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ సహకరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి
నాయకులు కొందరు పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు వినతిపత్రం అందించారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో బుధవారం పీసీసీ అధ్యక్షుడిని కలిసిన నేతలు, ఈ
మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా క్రిష్ణ మాదిగ వర్గీకరణకు
అనుకూలంగా కాంగ్రెస్ సహకరించాలని కోరుతూ ఇచ్చిన వినతిపత్రాన్నిఆయనకు
అందజేశారు. దీనిపై స్పందించిన గిడుగు రుద్రరాజు, ఇది జాతీయ స్థాయి అంశం
కాబట్టి.. వినతిపత్రం, వర్గీకరణ అంశాన్ని పార్టీ హైకమాండ్ ద్రుష్టికి
తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.