తెనాలి : బ్రహ్మాణకోడూరు నివాసి, సమాజ సేవకుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు,
మహోన్నత విద్యావేత్త ముప్పాళ్ళ నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమం తెనాలి,
సుల్తానాబాద్‌లోని సువర్ణ ఇన్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఘనంగా జరిగింది.
సభకు ముప్పాళ్ళ విజయగాంధీ అధ్యక్షత వహించారు. సభకు విద్యావేత్తలు, పండితులు,
స్నేహితులు, బంధువులు విశేషంగా పాల్గొన్నారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి
అధ్యక్షులు, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర సహాయ కార్యదర్శి
ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుడు, నిరంతర అభ్యాసకుడు,
పరిశోధకుడు అనే ధ్యేయంతో తరగతి గది ప్రపంచానికి అడ్డం వంటిదని విద్యార్ధులను
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉన్నత ఆశయంతో నిరంతరం కృషి చేసిన
మహోన్నతుడు. ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. ముప్పాళ్ళ జీవిత విశేషాలను ఆయన
ఉపాధ్యాయునిగా విద్యార్ధులకు చేసిన కృషిని వివరించారు. ఉపాధ్యాయులు సరళమైన
సేవతత్పరతతో మెలగాలని చెప్పారు. ముప్పాళ్ళ విద్యార్థులకు విలువలతో కూడిన
విద్యనే గాక, క్రమశిక్షణ, స్నేహభావం, ‘సేవాతత్పరతతో మెలగాలనే భావంతో
విద్యార్థులను తీర్చిదిద్దారని, నేటికి జిల్లా వ్యాప్తంగా ఆయన పేరు
స్థిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. ఆయన అక్షర జ్ఞానం నుండి ఆధ్యాత్మిక
అంశాల వరకు సంగీత సాహిత్య సమాజసేవ, క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం అంశాలను
విద్యార్థులలో ఇనుమడింపజేశారని అన్నారు. విద్యార్థులతోపాటు సమాజ అభివృద్ధికి
జీవితాంతం కృషి చేశారని చెప్పారు. కృష్ణా జిల్లా, విజయవాడ, ప్రెస్ క్లబ్
ప్రధాన కార్యదర్శి నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ సమాజం కోసం, దేశం కోసం
ప్రజాక్షేమం కోరుతూ అందర్ని తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముప్పాళ్ళ నాగేశ్వరరావు
జీవితాంతం కృషి చేశారని ఆయనను నేటితరం ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని మెలగాలని
హితవుపలికారు. ఉ పాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని, తనకన్నా గొప్ప
మేధావులుగా ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ కోవకు చెందిన
వారే ముప్పాళ్ళ అని ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. సభా ప్రారంభంలో ఆయన
సహధర్మచారిణి చిత్రపటానికి పూలతో పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో తాళ్ళూరి
కృష్ణమూర్తి, దాసరి సుభాషిణి, మరదాపు నాగేశ్వరరావు, కె.వి. సుబ్బారావు
తదితరులు పాల్గొన్నారు.