గుంటూరు : అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడారని, రూ.118 కోట్ల
ముడుపులు ఎందుకు లెక్కల్లో చూపలేదని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్
ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పీఏ ద్వారా చంద్రబాబు
ముడుపులు తీసుకున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం
లేదు?. నేను సత్యహరిశ్చంద్రుడునని చెప్పే బాబు ఇప్పుడు ఏం చెబుతారన్నారు. ఐటీ
నోటీసులపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఎల్లో మీడియా నోటీసులపై ఎందుకు
మాట్లాడదు?. చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు స్పందించడం లేదు? రూ.118 కోట్ల
అవినీతి కనిపించడం లేదా?. చంద్రబాబు అవినీతిపై పవన్ కనీసం ట్వీట్ కూడా
పెట్టలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా వాటా ఉందా?. చంద్రబాబు అవినీతిపై
వామపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదని అనిల్ మండిపడ్డారు. చంద్రబాబుకు శక్తి,
వయసు అయిపోయింది.. చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన సమయం మాత్రమే మిగిలి
ఉంది. ఐటీ శాఖ ఇప్పటికే నాలుగు నోటీసులు ఇచ్చిందన్నారు. దత్తపుత్రుడికి కూడా
ఈ లావాదేవీలలో ముడుపులు అందాయి. అందుకే ప్రశ్నిస్తానని చెప్పే దత్తపుత్రుడు
సైలెంట్ అయ్యారు. పురంధేశ్వరి కూడా తన మరిదిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
చంద్రబాబు, లోకేష్‌లకు దుబాయ్‌లో కూడా ముడుపులు అందాయి. బీజేపీ పెద్దలను
చంద్రబాబు కలవటం వెనుక కారణం కూడా ఈ ఐటీ కేసుల గురించే అన్నారు. ఇంకా విచారణ
జరిపితే భారీ అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారు. ఆయనను వెంటనే
అరెస్టు చేయాలనిమాజీ మంత్రి అనిల్ డిమాండ్ చేశారు.