గుంటూరు : డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరిలోని
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నాయకులు, టీచర్లు, విద్యార్ధులు ఘనంగా
నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత రెండవ రాష్ట్రపతి
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా
సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా
జరుపుకుంటారన్నారు. విద్యాబుద్ధులు నేర్పించి అజ్ఞానపు చీకట్లను తొలగించే
గురువులను గౌరవించుకునే బాధ్యత ప్రతి ఒక్క విద్యార్ధిపై ఉందన్నారు. ఈ
కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, శాసనమండలి సభ్యులు
అశోక్ బాబు, టీడీపీ హెచ్ఆర్డీ ఛైర్మన్ బూర్ల రామాంజనేయులు, కార్యనిర్వాహక
కార్యదర్శి బొద్దులూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల
రమేష్, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, ఆహ్వాన కమిటీ సభ్యులు
హసన భాషాతో పాటు పార్టీ నాయకులు పేరయ్య, దేవినేని శంకర్ నాయుడు, మునిరత్నం,
సాహెబ్, టీడీపీ ఎంపవర్ మెంట్ టీచర్లు యామిని, భాను, భవాని, ఉమా, శ్రీనివాస
చారీ, వెంకట సుధీర్, శ్రీను, అధికారితో పాటు విద్యార్థిని, విద్యార్ధులు పెద్ద
సంఖ్యలో పాల్గొన్నారు.