గుంటూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
తెలిపారు. జన్మనిచ్చిన అమ్మా నాన్నల తరవాత అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది
గురు దేవుళ్ళ దగ్గరేనని వ్యాఖ్యానించారు. వీసమెత్తు కూడా ప్రతిఫలం
ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి తమ శిష్యుల విజయాలను తమవిగా భావిస్తారని
గురువులను కొనియాడారు. పవిత్రమైన బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ
దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు- శిష్యులను
బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతారన్నారు. దేశ పురోగతిలో తమ వంతు పాత్రను
మరింత సమర్థంగా పోషించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల ఆంధ్రప్రదేశ్ పాలకులు, ఉన్నతాధికారులు
అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోందన్నారు. ఉపాధ్యాయ వర్గంపై కక్ష
సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యలు
సైతం అందుకు అనుగుణంగానే ఉంటున్నాయని మండిపడ్డారు. బోధనేతర విధులతో వారిని
ఇబ్బందుల పాలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు పనుల్లో పాలక
పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారని వైసీపీ
ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని
స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30 వేల
మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఉపాధ్యాయ
దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో ఏ ఉపాధ్యాయుడికీ ఇంకా జీతం చెల్లించలేదంటే ఈ
ప్రభుత్వానికి గురు దేవుళ్ల విషయంలో ఏ విధమైన ధోరణిని అవలంభిస్తోందో
అర్థమవుతోందని విమర్శించారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన
వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుందని ఈ సందర్భంగా పవన్
కల్యాణ్ హామీ ఇచ్చారు.