ఏపీతో కొలాబరేషన్పై చర్చలు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి అటవీ విశ్వ విద్యాలయం (ఫారెస్టు
యూనివర్సిటీ) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమెరికాలోని
పర్యటిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడి అలబామాలోని సుప్రసిద్ధ
ఆబర్న్ యూనివర్సిటీ అధికారులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
ప్రభుత్వ విదేశీ విద్యా కో-ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు మంత్రి
బొత్సకు స్వాగతం పలికి ఆబర్న్ యూనివర్సిటీ అధికారులను పరిచయం చేశారు.
ఏపీ ప్రభుత్వంతో ఈ యూనివర్సిటీ కొలాబరేషన్ కొరకు ఆయన అధికారులతో
చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉన్నత విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, విద్యా రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి
వై.యస్.జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు.
ఉన్నత విద్యారంగాన్ని మరింత ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం దాదాపు 2600
ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నామని తెలిపారు.