నాగేశ్వరరావు
అత్తిలి : మహిళల ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి
పరిపాలన జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి డాక్టర్
కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలం అత్తిలి శ్రీ వల్లి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన మహిళలకు సున్నా
వడ్డీ పంపిణీ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మహిళల
ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారని
ఆయన అన్నారు. 2019 అధికారంలోకి వచ్చిన మన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారని సున్నా వడ్డీకి మాట ఇవ్వకపోయినా అమలు
చేస్తున్నారని ఆయన చెప్పారు. 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్న డ్వాక్రా రుణాలను
మాఫీ చేసి నాలుగు విడతల్లో మహిళలు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారని ఈ
సందర్భంగా ఆయన అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు 25వేల కోట్ల రూపాయలు
రుణమాఫీలను నాలుగు విడతలలో జమ చేయడంతో పాటు మరో 7 వేల కోట్లు రూపాయలు సున్నా
వడ్డీ ఇచ్చి మొత్తం 32 వేల కోట్ల రూపాయలను ఆర్థిక లబ్ధిని డ్వాక్రా మహిళలకు
చేకూర్చిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందని మంత్రి కారుమూరి అన్నారు.
ఒక్కఅత్తిలి మండలంలో 2022-23 సంవత్సరమునకు గాను 1,527 మహిళా గ్రూపులకు సున్నా
వడ్డీ మంజూరయ్యాయని నాలుగో విడతగా 15,293 అక్క చెల్లెమ్మలకు రూ 2.18 లక్షలు
రూపాయలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సెప్టెంబర్ నెలలో అత్తిలి మండలంలో
కొత్తగా 505 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కారుమూరు సున్నా వడ్డీ
కార్యక్రమంలో తెలిపారు. ప్రజలకు గత ప్రభుత్వాలు హామీలకే పరిమితం అయ్యాయని ఈ
సందర్భంగా ఆయన అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలనే ఆకాంక్ష
ముఖ్యమంత్రి తపన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేస్తున్న
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఇంటిలో ఓ కుటుంబ సభ్యుడిగా ప్రజలు
భావిస్తున్నారు అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చి అన్ని
మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారన్నారు. విద్యా కానుక విద్యా దీవెన అమ్మబడి
లాంటి మంచి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకుని
ఆర్దికంగా స్థిరపడి ఆ కుటుంబానికి తోడ్పడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆకాంక్షని ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి
వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పలు
శాఖల అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.