స్వీకారోత్సవ సభ
ఈనెల 7 న బందర్ రోడ్, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియం లో రాష్ట్ర
కార్యవర్గం ప్రమాణస్వీకారం
ముఖ్య అతిథిగా హాజరు కానున్న వాసిరెడ్డి పద్మ , చైర్ పర్సన్, ఏపీ మహిళా కమిషన్
పోస్టర్ రిలీజ్ చేసిన ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,
పలిశెట్టి దామోదర రావు
విజయవాడ : ఏపీజేఏసీ అమరావతి రాష్ట్రంలోని మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి
అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఎప్పుడు వారికి
అండగా ఏపీజేఏసీ అమరావతి ఉంటుందని రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదర్ రావులు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవ
ఏర్పాట్లపై మహిళా ఉద్యోగ ప్రతినిధుల కమిటీ తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో
ఏపీజేఏసీ అమరావతి అనుబంధంగా రాష్ట్ర మహిళా విభాగం గత 2017 నుండి ఏర్పాటు
కాబడి, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా
పనిచేసిన రాష్ట్ర కార్యవర్గం కాలపరిమితి ముగిసినందున నూతన కార్యవర్గం చేత ఈనెల
ఏడవ తేదీన విజయవాడ బందర్ రోడ్ లోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియం లో
ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో సోమవారం
విజయవాడలోని రెవెన్యూ భవన్ లో మహిళా విభాగం ప్రతినిధులు, జేఏసీ లోని వివిధ
భాగస్వామ్య సంఘాల నాయకులు తదితరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈనెల 7 న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసిరెడ్డి పద్మ చైర్ పర్సన్,
ఏపీ మహిళా కమిషన్, విశిష్ట అతిథిగా అతిధి సింగ్, సబ్ కలెక్టర్, విజయవాడ, ఏపీ
జేఏసీ అమరావతి లోని భాగస్వామ్య సంఘాల నాయకులు తదితరులు పాల్గొంటారు. ఈ
సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు, మహిళా విభాగం నాయకురాళ్లు అందరూ
కలిసి “మహిళా విభాగం నూతన రాష్ట్ర కార్యవర్గ ప్రకటనకు సంబంధించి”పోస్టర్
రిలీజ్” చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బొప్పరాజు సెక్రటరీ జనరల్ పలిశెట్టి
దామోదర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 60 శాతం మేర
మహిళ ఉద్యోగులు పనిచేస్తున్నారని వారికి సంబంధించిన రాయితీలు హక్కులు
సాధించేందుకు ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం పనిచేస్తుందని తెలుపుతూ మహిళా
విభాగానికి ఏపీ జెఎసి అమరావతి అండగా నిలబడుతుందని తెలియజేశారు. రాష్ట్ర
ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో ఏపీజేఏసీ అమరావతి జేఏసీ
కనుబంధంగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామనీ తెలియజేస్తూ వారి
సమస్యలు వారే పరిష్కరించుకునే విధంగా మహిళా విభాగం తయారు కావాలని కోరుతూ, 7వ
తేదీన జరుగబోయే ప్రమాణ స్వీకారోత్సవాన్ని జయప్రదం చేయాలని మహిళా ఉద్యోగుల
అందరికీ పిలుపునిచ్చారు.
ప్రమాణ స్వీకారోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు జరుగు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా
విభాగం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రెవెన్యూ భవన్లో నేడు
పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీతో
పాటు నూతనంగా ఎంపిక కాబోయే మహిళా విభాగం నాయకురాళ్లు శ్రీమతి పారె లక్ష్మి,
పొన్నూరు విజయ లక్ష్మి, జి.పావని, సైకం శివ కుమారి రెడ్డి తదితరులు, అలాగే
ఏపీ జేఏసీ అమరావతి సహా చైర్మన్ టివి ఫణి పెర్రాజు, దొప్పలపూడి ఈశ్వర్,
బి.కిషోర్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఇతర సభ్యులు పాల్గొన్నారు.